అయ్యన్న పాత్రుడిలా అమ్మాయిలతో స్టేజిలపై డ్యాన్స్ లు చేసే వ్యక్తిని కాదు – ఏపీ మంత్రి

Thursday, September 24th, 2020, 04:50:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం నాడు మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తను డబ్బుకు ఆశ పడే వ్యక్తిని కాదు అని అన్నారు. అంతేకాక తెలుగు దేశం పార్టీ కీలక నేత అయ్యన్న పాత్రుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో తనకు చంద్రబాబు ఒక ఆఫర్ ఇచ్చారని తెలిపారు. టీడీపీ లోకి రమ్మని 50 కోట్ల రూపాయల ఆశ చూపినట్లు తెలిపారు. పదవి, డబ్బు వద్దు అని, వదిలేశా అని మంత్రి స్పష్టం చేశారు.

అయితే అమరావతి లో భూ కుంభకోణం కి పాల్పడ్డ చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు ఇద్దరు కూడా ప్రజల మధ్య కి రావాలి అని అన్నారు. అయ్యన్న పాత్రుడు తప్పుడు ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయ్యన్న పాత్రుడు లా అమ్మాయిలతో స్టేజిల పై డ్యాన్స్ లు చేసే వ్యక్తిని కాదు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సీబీఐ కి ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు అని, తను తప్పు చేయను అని, విమర్శ లకు భయపడేది లేదు అని తెలిపారు. అయ్యన్న పాత్రుడు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.