టీడీపీ కి అక్కడ సంఖ్యా బలం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు!

Friday, July 31st, 2020, 11:12:41 PM IST


గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలన రాజధానిగా వైజాగ్ కి సీఎం జగన్ త్వరలో శంకుస్థాపన చేస్తారు అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గవర్నర్ తీసుకున్న తువంటి నిర్ణయం శుభ పరిణామం అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.అయితే మూడు రాజధానుల బిల్లును రాష్ట్రం లో ప్రరు ఒక్కరూ స్వాగతిస్తున్నారు అని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యం అని మూడు రాజధానుల బిల్లును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

నేడు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకమైన రోజు అని బొత్స పేర్కొన్నారు. అయితే శాసన మండలి లో టీడీపీ కి సంఖ్య బలం ఎక్కువగా ఉండటం చేత ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.వీధి రౌడిల్లా బిల్లును అడ్డుకున్నారు అని, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, చివరకు ధర్మమే గెలిచింది అని అన్నారు. అమరావతి కూడా అంతర్భాగమే అని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, రాజధాని రైతులకు తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.