ప్రతిపక్షం ఉనికిని చాటుకునేందుకే ఇలా…మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు

Friday, January 8th, 2021, 04:52:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ పై వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, ప్రతి పక్ష పార్టీ టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఈ శాఖ కి ఏడాది కి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే, నేడు జగనన్న ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలు కేటాయించింది అని అన్నారు. అమ్మ వడి పథకం పై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళలు మరియు చిన్నారులకు భద్రత దృష్ట్యా దిశ చట్టం తెచ్చారు అని అన్నారు.

అయితే ఇప్పటి వరకూ రాజధాని మరియు కులాల అంశాలు తెరపైకి తెచ్చినా స్పందన లేకపోవడం తో కొత్తగా దేవుడిని ముందుకు తీసుకు వచ్చారు అని విమర్శించారు. ప్రతి పక్షం తమ ఉనికిని చాటుకునేందుకు ఇలా తెరపైకి తీసుకు వస్తున్నారు అని, దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే టీడీపీ సమయం లో విజయవాడ లో దేవాలయాల కూల్చి వేత పై బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే దుర్గ గుడి అభివృద్ది కోసం సీఎం జగన్ 70 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.