టీడీపీ పాలన లో రాష్ట్ర అభివృద్ది ఆగిపోయింది – మంత్రి బుగ్గన

Tuesday, October 20th, 2020, 04:32:40 PM IST

ఢిల్లీ పర్యటన లో బాగంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన మంత్రి బుగ్గన భోగాపురం విమానాశ్రయ నిర్మాణ గురించి చర్చించారు. అయితే భోగంపురం ఏర్ పోర్ట్ నిర్మాణ పనులను సత్వరమే చేపట్టాలని కోరినట్లు చెప్పారు.వైజాగ్ ఏర్ పోర్ట్, నేవల్ ఏర్ పోర్ట్ నుండి నూతన ఏర్ పోర్ట్ కి మార్పు మరియు విధి విధానాల పై చర్చ జరిపినట్లు తెలిపారు.అయితే ఓర్వకల్లు ఏర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్దంగా ఉంది అని తెలిపారు.

రాష్ట్రంలోని వర్షాలు మరియు వరదల పై రెవెన్యూ శాఖ నివేదికలు సిద్దం చేస్తున్న విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో నీ నూతన రహదారుల అంశం పై నితిన్ గడ్కారీ తో చర్చిస్తాం అని తెలిపారు. అయితే ఈ మేరకు కేంద్రం సహాయం కొరతాం అని తెలిపారు. అయితే రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరిగింది అని, అంతేకాక అప్పుడు తెలుగు దేశం పార్టీ పాలనలో రాష్ట్ర అభివృద్ది ఆగిపోయింది అని బుగ్గన తెలిపారు.