గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు

Friday, September 4th, 2020, 12:28:22 AM IST


గురువారం నాడు మీడియా సమావేశం లో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మరొకసారి వ్యవసాయ రంగం పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు అని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతుల ఆత్మ హత్యలు అత్యంత బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పై సైతం పలు విమర్శలు చేశారు. వ్యవసాయ రంగం ను పూర్తి గా విస్మరించడం చేత 2019 లో 313 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు అని మీడియా సమావేశం లో పేర్కొన్నారు.

అయితే ఆ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాం అని తెలిపారు. అయితే ఈ సహాయాన్ని జిల్లా కలెక్టర్ అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం తో రైతులకు భరోసా కల్పించాం అని తెలిపారు. అయితే రైతుల కోసం చేపట్టిన చర్యలను, లాక్ డౌన్ లో కూడా రైతులకు ఉపయోగపడేలా తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు.