రాముడి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక కుట్ర కోణం

Sunday, January 3rd, 2021, 05:20:41 PM IST

రామతీర్థం ఆలయం లోని రాముడు విగ్రహం ధ్వంసం ఘటన పై అధికార పార్టీ కి చెందిన పలువురు నేతలు ప్రతి పక్ష పార్టీ తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దేవాలయాల పై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం ఉందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తిరుమల శ్రీవారి ను ఆదివారం నాడు ఉదయం దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రతి పక్షం కుట్ర చేస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అంతర్వేది లో రథం దగ్దం ఘటన, రామతీర్థం లోని రాముడు విగ్రహం ధ్వంసం ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, చంద్రబాబు నాయుడు హయాంలో దేవాలయాల కూల్చివేత, గోషాలలు రక్షించలేని పరిస్థితి నెలకొని ఉన్నాయి అంటూ గత ప్రభుత్వం పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దేవుడి దయతో త్వరలో విగ్రహాల ధ్వంసం కేసు నిందితులు దొరుకుతారు అంటూ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు టీడీపీ పై చేస్తున్న వరుస ఆరోపణలకు వారు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.