వాటి గురించి రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు – ఏపీ మంత్రి

Saturday, August 22nd, 2020, 11:10:43 PM IST


శనివారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా కాణిపాకం ఆలయంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ పట్టు వేడుకల్లో పాల్గొని వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నేపధ్యంలో లో మాట్లాడుతూ వేడుకలో పాల్గొనడం ఆనందం గా ఉంది అని, వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. అయితే ఈ మేరకు సీఎం జగన్ ను గుర్తు చేస్తూ, సీఎం జగన్ వలన ఈ అదృష్టం దక్కింది అని, ఈ కాణిపాకం గుడి ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తాం అని అన్నారు. అయితే కాణిపాకం కి మాస్టర్ ప్లాన్ ఉంది అని, దానిని త్వరలో అమలు చేస్తాం అని అన్నారు.

అయితే ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. వినాయక చవితి ఉత్సవాల గురించి రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో మాట్లాడుతున్నారు అని ఆరోపించారు. వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో కాణిపాకం కి వచ్చి చూడాలి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో, రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ లో ఉంటే ఏం తెలుస్తుంది అంటూ సూటిగా ప్రశ్నించారు.