బాబుకి పవన్ వకీల్ సాబ్ లా పని చేస్తున్నాడు

Thursday, December 31st, 2020, 03:50:42 PM IST

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పవన్, అప్పట్లో కూడా వైసీపీ పైనే విమర్శలు చేశారు అని, ఇప్పుడు కూడా వైసీపీ పై నే విమర్శలు చేస్తున్నారు అన్నట్లు గా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యల తో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరొకసారి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లా పని చేస్తున్నాడు అంటూ విమర్శించారు. 2014 నుండి చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని నీ విమర్శించే అర్హత పవన్ కి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఒకే రోజు పవన్ మరియు లోకేష్ లు పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల్లో సీఎం జగన్ పరిహారం అందిస్తున్నారు అని,చంద్రబాబు పాలన లో ఏనాడైనా పరిహారం త్వరగా ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు పవన్ ఎందుకు అడగలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు.