చంద్రబాబు ట్రాప్ లో పడి పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారు – మంత్రి అవంతి శ్రీనివాస్

Friday, September 11th, 2020, 03:00:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమరావతి రాజదాని అంశం పై స్పందిస్తున్న టీడీపీ, జన సేన పార్టీ లపై మరొకసారి మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి పవన్ కళ్యాణ్ అమరావతి పై ప్రేమ కనబరుస్తున్నారు అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలి అన్న ఉద్దేశ్యం తో నే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు అని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజల్లో చిచ్చు పెడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్రం లో అంతర్వేది రథం దగ్ధం ఘటన పై పలు పార్టీలు సీబీఐ దర్యాప్తు కోరిన సంగతి తెలిసిందే. అయితే అంతర్వేది ఘటన పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు మంత్రి అవంతి శ్రీనివాస్. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం సంతోషకరం అని అన్నారు.అయితే రాష్ట్రం లో మతాల పేరిట విద్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి అని మంత్రి వ్యాఖ్యానించారు.