టీడీపీ,బీజేపీ, జనసేన లు కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయి

Monday, January 18th, 2021, 06:34:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుసగా ఆలయాల విగ్రహాల ధ్వంసం విషయం లో డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే డీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పై నిరాధార ఆరోపణలు చేయడం సోము వీర్రాజు స్థాయికి తగదు అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయితే జాతీయ పార్టీ కి రాష్ట్ర అధ్యక్షుడు గా వ్యవహరిస్తున్న సోము వీర్రాజు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు. అయితే ఆలయాల పై దాడులు చేసిన బీజేపీ, టీడీపీ కార్యకర్తల పై కేసులు నమోదు చేయడం డీజీపీ తప్పా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే పోలీస్ వ్యవస్థ తమ పని తాము చేసుకొని పోతుంటే, ప్రతి పక్ష పార్టీలు ఏకంగా డీజీపీ నే టార్గెట్ చేశారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంత వారైనా కఠిన చర్యలు తప్పవు అని మంత్రి బొత్స హెచ్చరించారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాబు రాష్ట్రంలో మనుగడ కష్టమని మతి భ్రమించి ఇలా చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యం గా టీడీపీ, బీజేపీ, జన సేన లు వ్యవరిస్తున్నాయి అని అన్నారు.