నిమ్మగడ్డ కి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సూటి ప్రశ్న…అవి ఎలా నిర్వహిస్తారు?

Wednesday, October 28th, 2020, 08:04:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు అని మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ను సంప్రదించకుండా అఖిల సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. అయితే గతం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజుకి రెండు మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన సందర్భం లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు అని మంత్రి గుర్తు చేశారు.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజుకి రెండు నుండి మూడు వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని, ఇలా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు కి అనుకూలంగా వ్యవహరించడం తగదు అని, రాజ్యాంగ బద్దంగా ఉండే పదవిలో ఉండి ఇష్టానుసారం గా వ్యవహరిస్తాం అంటే తగదు అని, అంతేకాక కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారి పట్ల జాగ్రత్త గా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.