నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి

Friday, January 29th, 2021, 07:44:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా నెలకొన్న పరిస్తితుల పట్ల దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావుడ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ చౌదరి శునకానందం పొందుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రజా శ్రేయస్సే ప్రధానం గా పని చేస్తున్న ఆయన గతంలో ఎన్నికలు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారోతెలీడం లేదు అంటూ విమర్శలు చేశారు. అయితే నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి అని ఆరోపించారు. ఎన్నికలకు తాము ఎప్పుడైనా సిద్ధమే అంటూ మంత్రి తెలిపారు.

అయితే చంద్రబాబు నాయుడు పైనా మంత్రి విమర్శలు చేశారు. తమకంటూ సొంత పథకం ఒక్కటి కూడా లేదు అని, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి ఇప్పుడు మతి భ్రమించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిమ్మగడ్డ రమేష్ చౌదరి చంద్రబాబు పై చర్యలు తీసుకునే సాహసం చేయగలరా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు వంద శాతం ఫలితాలతో నిమ్మగడ్డ కి బుద్ది చెబుతారు అంటూ మంత్రి తెలిపారు.అయితే చంద్రబాబు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఆయన్ను నమ్మరు అంటూ చెప్పుకొచ్చారు.