నారా లోకేష్ ట్వీట్లు దిగజారి ఉన్నాయి – ఏపీ మంత్రి

Monday, September 7th, 2020, 07:16:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ పై తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం పట్ల మంత్రి గౌతం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తప్పుడు ప్రచారం పట్ల పలు వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ వలనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి రాంక్ వచ్చింది అని ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనం అని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ లు దిగజారి ఉన్నాయి అని, పదవ తరగతి నారాయణ స్కూల్ రాంకులు ప్రచారం చేసుకున్నట్లు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు జరిగింది అని, ఈ సమయం లో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలి అని, ఇలాంటి అబద్దాలతో నారా లోకేష్ భవిష్యత్ కి నష్టం అని మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాక పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి అని దుష్ప్రచారం చేసే మీరు, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అంటూ టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.