జగన్ ఒక సుదీర్ఘ విజన్ తో పని చేస్తున్నారు

Wednesday, December 16th, 2020, 05:07:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై వైసీపీ నేతలు, ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు అని తెలిపారు. ఆయన దొడ్డి దారిలో సీఎం కాలేదు అని, ప్రజా బలం తో తనను తాను నిరూపించుకొని, సీఎం అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. 19 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్ ది అంటూ కొనియాడారు. సీఎం జగన్ మొక్కవోని ధైర్యం తో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు అని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే సీఎం జగన్ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అని అన్నారు. ఒక సుదీర్ఘ విజన్ తో పని చేస్తున్నారు అని తెలిపారు.