48 గంటల సవాల్ విసిరి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి – మంత్రి బొత్స!

Thursday, August 6th, 2020, 07:46:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజధాని వికేంద్రీకరణ పై ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 48 గంటల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు 48 గంటల సవాల్ విసిరి ఏం చేశారో చెప్పాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి ను రాజధాని గా చేయడం పట్ల టీడీపీ పై పలు వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స. వ్యక్తి గత స్వార్థం కోసం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

చట్టానికి లోబడి తాము నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్నాము అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.అమరావతి రాజదాని కాదు అని ఎవరు మీకు చెప్పారు అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అంతేకాక అమరావతి లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన చేస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మొత్తం వీడియో లని కాకుండా,.ముందు వెనుక వీడియో లని కట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.