చంద్రబాబు డైరెక్షన్ లో యెల్లో మీడియా…సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి

Monday, September 14th, 2020, 04:13:34 PM IST

ప్రతి పక్ష పార్టీ వైఖరి నీ మరోమారు ఎండగట్టారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఎల్లో మీడియా పని చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి రదక్రి కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రహదారుల టెండర్ల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది అని, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నాం అంటూ మంత్రి శంకర్ నారాయణ మీడియా సమావేశం లో వివరించారు.

అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక పోతున్నారు అని శంకర్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక సీఎం జగన్ పై గోబెల్స్ ప్రచారం చేశారు అంటూ ఆరోపణలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన పాలన లో 3000 కోట్ల రూపాయల రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించారు అని ఆరోపించారు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ కావడం తెలుగు దేశం పార్టీ కి మరియు యెల్లో మీడియా కి ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ ల సంక్షేమానికి 50 వేల కోట్ల రూపాయల కి పైగా ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో దాక్కొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నారు అంటూ వరుస విమర్శలు గుప్పించారు.