పవన్ గురించి మాట్లాడటం అనవసరం – మంత్రి అనిల్ కుమార్

Tuesday, August 4th, 2020, 12:32:18 AM IST


మూడు రాజధానుల నిర్ణయం పట్ల టీడీపీ, జన సేన పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమరావతి పై ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారు అని, దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. తమ 23 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కపట నాటకాలు మానుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ను రాజదాని గా తీసి వేయలేదు అని, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం అని అన్నారు.

అయితే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టలేదు అని, కానీ తన బినామీ లు నష్ట పోతారు అని బాధపడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకున్నారు కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో అలా చేయలేదు అని, అక్రమ కట్టడం లో తల దాచుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎపుడూ కన్ఫ్యూజన్ లో ఉంటారు అని, ఎపుడు ఏం మాట్లాడతారో తెలియదు అని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనవసరం అంటూ విమర్శలు చేశారు. ఒకసారి టీడీపీ మరోమారు బీజేపీ అంటారు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.