సినిమాల్లోనే పవన్ వకీల్ సాబ్…బయట మాత్రం పకీర్ సాబ్

Tuesday, December 29th, 2020, 04:31:35 PM IST

పవన్ గుడివాడ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ తీరు పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే వకీల్ సాబ్ అని, బయట మాత్రం పకీర్ సాబ్ అంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన సినిమా ప్రమోషన్ లా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు సీఎం జగన్ చేస్తున్న పనులతో పాటుగా, ప్రతి పక్ష పార్టీ టీడీపీ పై సైతం మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ అధికారం చేపట్టిన అనంతరం నుండి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకునీ పేదలకు అండగా నిలిచారు అని, చంద్రబాబు అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసి ఇళ్ళ పట్టాల పంపిణీ అడ్డుకున్నప్పటికి వాటిని చేదించి సీఎం జగన్ పేదలకు పట్టాలు అందించారు అని తెలిపారు. జయంతికి, వర్ధంతి కి తేడా తెలియని లోకేష్ జగన్ ను విమర్శించడం హాస్యాస్పదం అంటూ సెటైర్స్ వేశారు. జగన్ పాలనలో ప్రజలు అంతా కూడా సంతోషం గా ఉన్నారు అంటూ మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.