వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయం – ఏపీ మంత్రి

Thursday, September 17th, 2020, 03:51:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రతి పక్ష పార్టీ నేత, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి, ఇంటివద్దకే పథకాలను చేరుస్తున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు.విజయవాడ లోని తూర్పు నియోజక వర్గం లో సమస్యలను సీఎం జగన్ దృష్టి కి తీసుకెళ్లి దేవినేని అవినాష్ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.

అయితే అక్కడి స్థానిక ఎమ్మెల్యే మాత్రం మాటలకే పరిమితం అయ్యారు అని విమర్శించారు. ప్రస్తుతం తూర్పు నియోజక వర్గం లో 250 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరుగుతున్నాయి అని మంత్రి తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి రాజధాని పేరుతో భూములను బినామీ లకు దోచిపెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల పై దాడులు పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ విమర్శించారు.అయితే చంద్రబాబు నాయుడు చేసే కుట్ర రాజకీయాల వలన రాబోయే ఎన్నికలలో కుప్పం లో కూడా ఓడిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.