చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శంకర్ నారాయణ

Friday, September 4th, 2020, 02:05:05 AM IST


గత ఎన్నికల్లో భారీ ఓటమి చవి చూసిన తెలుగు దేశం పార్టీ పై వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలను, అప్పులను మరొకసారి వైసీపీ వేలెత్తి చూపిస్తోంది. అయితే రహదారులను అభివృద్ది చేయాలనే దృక్పథం తో ముందుకు వెళ్తున్నాం అని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రహదారుల అభివృద్ది పై ఏపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.

అయితే గత ప్రభుత్వం హయం లో 2014 లో చంద్రబాబు నాయుడు మూడు వేల కోట్ల రూపాయల కి పైగా అప్పులు కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారు అని, అయితే ఆ డబ్బు ను రోడ్ల అభివృద్ధికి ఉపయోగించ కుండా ఎన్నికల్లో గెలవడం కోసం మరియు ఇతర కార్యక్రమాలకి మళ్లించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ అప్పుకి 250 కోట్ల రూపాయల డబ్బు ను వడ్డీ కింద చెల్లిస్తున్నాం అని తెలిపారు. అయితే ఏపీ లో రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి సీఎం జగన్ ఇంకా ఎక్కువగా నిధులు కేటాయించారు అని తెలిపారు.