ఓటుకు నోటు కేసులో దొరికినపుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదు?

Tuesday, August 18th, 2020, 04:20:26 PM IST

AP_minister

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రతి పక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పై చంద్రబాబు నాయుడు విచారణ జరపాలని కోరడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతం లో వైయస్సార్ హయాంలో కూడా చంద్రబాబు ఇలానే ప్రవర్తించారు, కానీ ఆరోపణలు నిరుపించలేకపోయారు,ఇపుడు సీఎం జగన్ పై కూడా అలానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికినపుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి ఎందుకు విచారణ చేయలేదు అంటూ నిలదీశారు. కేసీఆర్ కి భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అపుడు రాత్రికి రాత్రే విజయవాడ వచ్చి రాష్ట్రానికి ద్రోహం చేశారు అని, నేడు హైదరాబాద్ లో దాక్కొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి.