బీసీ ల వెన్ను చంద్రబాబు నాయుడు విరిచారు

Thursday, August 13th, 2020, 07:50:28 PM IST

Srinivasa-Gopala-Krishna

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ నేతలు, మంత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు అని, వైయస్సార్ చేయూత పథకం తో 23 లక్షల మహిళలకు లబ్ది చేకురిండి అని మంత్రి శ్రీనివాస్ గోపాల్ కృష్ణ అన్నారు. ఈ మేరకు జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు.

చంద్రబాబు నాయుడు మహిళల్ని ఏనాడు పట్టించుకోలేదు అని, డ్వాక్రా మహిళలను మోసం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకం ప్రవేశ పెట్టారు అని, ప్రజలు అందుకు 23 సీట్లు ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు తన కొడుకు క్షేమం కోసం పాటు పడ్డారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

మీడియా ఉండటం చేత బాబు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, వైయస్సార్ చేయూత పై అదే విధంగా వ్యవహరిస్తే మహిళలు తగిన బుద్ది చెబుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ లను చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా మోసం చేశారు అని, ప్రభుత్వం పై బురద చల్లాలనే ఉద్దేస్యం తో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. బీసీ ల వెన్ను చంద్రబాబు నాయుడు విరిచారు అని మంత్రి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు.