టీడీపీ సినిమా ముగిసింది…చంద్రబాబు కాలం అయిపోయింది – ఏపీ మంత్రి

Thursday, February 25th, 2021, 07:35:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయ బావుట కొనసాగించింది. అయితే తెలుగు దేశం పార్టీ కి కీలక స్థానాలు అయిన హిందూపురం, కుప్పం, తదితర ప్రాంతాల్లో కూడా వైసీపీ హవా కనిపించింది. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ పై, చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సినిమా ముగిసింది అని, చంద్రబాబు కాలం అయిపోయింది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజలు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు ను నమ్మడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాక పంచాయితీ ఎన్నికల ఫలితాలలో ఇది ప్రతిబింబించింది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే పంచాయతీ ఎన్నికల మాదిరి గానే పురపాలక మరియు పరిషత్ ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉందని, అదే వైసీపీ గెలిస్తే మాత్రం అక్రమాలు జరిగినట్లు చెప్పడం చంద్రబాబు నైజం అంటూ విమర్శలు చేశారు. కుట్రలు, కుతంత్రాలతో ఏదో రకంగా విజయం సాధించాలని ప్రయత్నం చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చతికిల పడ్డాడు అని అన్నారు. పంచాయతి ఎన్నికల్లో ఒక్కో విడత లో ఒక్కో విధంగా మాట్లాడటం చంద్రబాబు కే చెల్లింది అని, టీడీపీ శ్రేణులు పార్టీ ను వీడడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.