చంద్రబాబు ఎలా చెబితే ఎస్ఈసి అలా పనిచేస్తోంది

Sunday, January 10th, 2021, 11:00:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఎన్నికల నిర్వహణ పట్ల టీడీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. అయితే వైసీపీ నేటలు మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదు అంటూ చెబుతున్నారు. అయితే తాజాగా విద్యుత్ శాఖ మంత్రి బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను నిర్వహించడం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యతిరేకిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.చంద్రబాబు ఎలా చెబితే ఎస్ఈసి అలా పని చేస్తోంది అంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వ సలహా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలి అని అనుకుంటున్నారు అని, ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అని, గుజరాత్ లో కూడా ఎన్నికలు వాయిదా వేశారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పుట్టిన రోజు సంబరాలకు, వైసీపీ ఊరేగింపులకి, రికార్డింగ్ డాన్సులకి కరోనా ఉండదు అని దేవినేని ఉమా సైతం తెలిపారు. మీ నేతల కోతముక్కలాటలకు అడ్డురాని కరోనా, ఎన్నికల కి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది అని సూటిగా ప్రశ్నించారు. మీ ప్రభుత్వ విధానాల పై అప నమ్మకమా? ప్రజాగ్రహానికి భయపడా? ఎందుకు ఎన్నికలు అంటే భయపడుతున్నారు జగన్ అంటూ దేవినేని ఉమా వరుస ప్రశ్నలు వేశారు. అంతేకాక అందుకు సంబంధించిన వీడియో ను సైతం సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.