చంద్రబాబు పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Tuesday, January 5th, 2021, 03:56:06 PM IST

రామతీర్థం లో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరం అంటూ వైసీపీ కీలక నేత, మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన, ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే ఈ ఘటన పై ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చారు అని వివరించారు. అయితే రాష్ట్రం లో ఈ ఘటన పై ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రతి పక్షాల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణి చంద్రబాబు మానుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇతర దేవాలయాల పై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు, ఇప్పుడు రామతీర్థం ఎందుకు వచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే విజయనగరం జిల్లాలో ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఎక్కువ స్థానాల్లో గెలవడం తో చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు అని, పార్టీ ప్రయోజనాల కోసం రామతీర్థం వచ్చారు గానీ, రాముడి పై భక్తి తో కాదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రాష్ట్ర అభివృద్ది కి బీజేపీ, జన సేన పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ పై, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.