చంద్రబాబు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిది – కన్నబాబు

Sunday, October 4th, 2020, 07:52:54 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ కి చెందిన వైసీపీ నేత, మంత్రి కురసాల కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా తాను అధికారం లో ఉన్న ముఖ్యమంత్రి లా భ్రమల్లో ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ ను అరికట్టడం లో భారత దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ లో ఉన్నది అని మంత్రి వ్యాఖ్యానించారు. చక్కటి పరిపాలన తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ ను ఎదుర్కొంటుంటే, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం కరోనా సమస్యల పై తమ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు, కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి తండ్రి కొడుకులు హైదరాబాద్ లో ఉండి గుమ్మం దాటి బయటకు రాలేదు అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు కి అమరావతి మరియు అచ్చెన్నాయుడు గోల తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు అని విమర్శించారు. అయితే పరిపాలన కోసం జగన్ కి, పార్టీ కి చంద్రబాబు తో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని, ముందు మీరు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ఎక్కువ ఆందోళన పడితే మీ ఆరోగ్యానికే ఇబ్బందులు రావొచ్చు అని చంద్రబాబు పై సెటైర్స్ వేశారు. కరోనా వైరస్ మహమ్మారి తగ్గే వరకు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిది అని కోరుకున్నారు.