చంద్రబాబు ప్రభుత్వం ఎవరికైనా ఉచితంగా బోర్ వేసిందా – ఏపీ మంత్రి

Thursday, October 1st, 2020, 03:00:31 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఉచితంగా ఒక్క బోర్ అయినా వేయించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి బాగోలేక పోయినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు. అయితే బీసీ లను ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ లాగానే టీడీపీ చూసింది అని ఆరోపించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం అని, మేనిఫెస్టో మా పార్టీ కి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని సీఎం జగన్ చెప్పారు అంటూ బొత్స సత్యనారాయణ తెలిపారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరికైనా ఉచితంగా బోర్ వేసిందా, ఉచితంగా మోటార్ ఇచ్చిందా అంటూ నిలదీశారు. వెనుకబడిన వర్గాలు రాజకీయం గా ఎదగడానికి కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చాం అని అన్నారు. అందుకు అనుగుణంగా కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు. సీఎం జగన్ పై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు కనుక ఎన్నికల చరిత్రలో ఎవరికి ఇవ్వనన్ని సీట్లు ఇచ్చి తమ తీర్పు ఇచ్చారు అని బొత్స సత్యనారాయణ తెలిపారు.