చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కొడాలి నాని

Tuesday, September 29th, 2020, 07:44:14 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి కొడాలి నాని మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు దర్శకత్వం లో రోజూ మనకు మహా అధ్బుతమైన సినిమాను చూపిస్తున్నారు అంటూ మంత్రి కొడాలి నాని అన్నారు. అంతేకాక దళితులకు ద్రోహం జరుగుతుంది అంటూ టీవీ ఛానెల్స్ లో డిబేట్స్ పెడుతున్నారు అంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఎందుకు పనికి రాని కొంతమంది తెలుగు దేశం పార్టీ నేతలు టీవీ ల ముందుకి వచ్చి విష పూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. అంతేకాక నిజానికి టీడీపీ నేతలే దళితుల పై దాడులు చేయిస్తున్నారు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ళ స్థలాలు పంపిణీ అడ్డుకుంది చంద్రబాబు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది ను దృష్టి లో ఉంచుకొని సీఎం జగన్ అందరికీ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు అని మంత్రి వ్యాఖ్యానించారు.