అలా అనడానికి చంద్రబాబు ఒక ఉదాహరణ – ఏపీ మంత్రి

Sunday, September 27th, 2020, 10:04:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు వారి విమర్శలను సమర్ధంగా తిప్పికొడుతున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దళితులు అంటే ఎంతో గౌరవం అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అంతేకాక డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిబద్దత తో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు అని తెలిపారు.

దళిత మహిళకు హోమ్ మంత్రి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని ప్రశంసలు కురిపించారు. వైసీపీ అందరికీ సమానం గా హక్కులు మరియు హోదాలు ఉండాలని కోరుకొనే ప్రజా పార్టీ అంటూ కితాబు ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అని అనుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబు, ఇవాళ దళితుల కోసం మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

అయితే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని అనడానికి చంద్రబాబు ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే క్రియాశీల రాజకీయాల్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యల పై కూడా మంత్రి స్పందించారు. రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యల ను ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నాం అని పేర్కొన్నారు. అయితే ఒక వ్యక్తి చేసిన విమర్శలు సద్విమర్శ అయితే అంతా ఆహ్వానిస్తారు అని, నాయకుని పట్ల అంకిత భావంతో ఉండాలి అని పేర్కొన్నారు.