బూట్లు వేసుకొని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు – ఏపీ మంత్రి

Monday, September 21st, 2020, 09:11:22 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధికార తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కుట్రల తోనే ఆలయాల పై దాడులు జరిగాయి అని ఆరోపణలు చేశారు.దీని పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ కుట్ర తోనే ప్రజలను అయమయానికి గురి చేసే ఘటనలు జరిగాయి అని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే అన్యాక్రాంతమైన భూముల పరిరక్షణ కి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు టీడీపీ హయం లో కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చివేశారు అని, వాటిని పునః నిర్మించాలనే దే ప్రభుత్వం యొక్క ఆలోచన అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాక చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేశారు అని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకు వెళ్తామని, అంతేకాక చంద్రబాబు నాయుడు కి హిందువుల పై ప్రేమ లేదు అని తెలిపారు.