గుళ్లపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు – ఏపీ మంత్రి

Saturday, September 19th, 2020, 03:31:16 PM IST

శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. అయితే అక్కడ పూజలు చేసిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గుళ్ళపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం లోని పేదలకు ఇళ్ళ స్థలాలను ఇవ్వకుండా తెలుగు దేశం పార్టీ వారితో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుండి ఆపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమి కూడా పేదలకు పెంచలేదు అని ఆరోపించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే 15 లక్షల ఇళ్ళు సాంక్షన్ అయ్యాయి అని, కోర్టు అనుమతి వచ్చిన అనంతరం, మరో 15 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అయితే సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది అని మంత్రి వ్యాఖ్యానించారు.