చంద్రబాబు స్టే బాబు లా మారాడు…ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Thursday, September 17th, 2020, 06:15:36 PM IST

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు స్టే బాబు లా మారాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న ప్రతి ఒక్క అభివృద్ది కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అయిపోయింది అని, చంద్రబాబు పార్టీ జామ్ అయిపోయి, జూమ్ పార్టీ ల మారింది అంటూ వరుస విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్ని స్టే లు తెచ్చినా చ్ జగన్ సంకల్పం ను ఎవరు అడ్డుకోలేరు అని మంత్రి స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి అమరావతి భూముల విషయం లో హైకోర్టు కి వెళ్లి స్టే తెచ్చుకున్నారు అని విమర్శించారు.

అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అలజడులు సృష్టించేందుకు ఒక కుట్ర పూరితంగా హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయి అని మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాక చంద్రబాబు నాయుడు అవినీతిని వెలికి తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయం లో అవినీతి జరిగింది అంటూ వైసీపీ మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.