బీజేపీకి భయపడేందుకు మాది టీడీపీ ప్రభుత్వం కాదు

Monday, January 18th, 2021, 12:00:56 AM IST

బీజేపీ నేతల పై, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రం లో దేవాలయాల విగ్రహాల ధ్వంసం విషయం లో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విగ్రహాల ద్వంసాన్ని ఆధారాలతో సహా డీజీపీ బయటపెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. విగ్రహాల ధ్వంసం ఘటన లో డీజీపీ చెప్పినవి అన్నీ కూడా వాస్తవాలే అంటూ చెప్పుకొచ్చారు. అయితే డీజీపీ చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ, బీజేపీ డీజీపీ ను లక్ష్యం గా చేసుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే బీజేపీ కి భయపడేందుకు తమది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కాదు అని మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ అన్నారు. అయితే ఈ విషయం లో బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ మంత్రి సూచించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యం లో రాజకీయం గా లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని మంత్రి విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం లో ఉండగా గుళ్ళు కూల్చినప్పుదు బీజేపీ నేతలు, సోము వీర్రాజు ఎక్కడికి పోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.