ఆ కూల్చివేత లో బీజేపీ, జనసేన కు భాగస్వామ్యం లేదా? – దేవాదాయ శాఖ మంత్రి

Wednesday, September 9th, 2020, 06:55:01 PM IST

అంతర్వేది రథం కాల్చివేత బాధాకరం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన కి సంబందించిన దాని పై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని డీజీపీ ను ఆదేశించారు అని వివరించారు. అయితే 95 లక్షల రూపాయల కొత్త రథం ఏర్పాటు కోసం అధికారులను సీఎం జగన్ ఆదేశించారు అని తెలిపారు.

అయితే ఈ ఘటన విషయం లో కొన్ని రాజకీయ పార్టీలు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నాయి అని మండిపడ్డారు. అయితే రథాన్ని తగలబెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు అని మంత్రి తేల్చి చెప్పారు. అయితే విశ్వహిందూ పరిషత్ మరియు భజరంగ్ దళ్ ముసుగు లో కొందరు చర్చ్ పై రాళ్ళు విసిరారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అలా దాడులు చేసే వారిని క్షమించం అని తేల్చి చెప్పారు. అంతేకాక విచారణ కొనసాగుతోంది అని, అయినా కొందరు రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు నాయుడు పాలన లో 40 దేవాలయాలను కూల్చి వేశారు అని, అయితే అప్పుడు ఆ కూల్చి వేతలో బీజేపీ, జన సేన కి భాగస్వామ్యం లేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చిన వాటిని తిరిగి నిర్మించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అని, దాడులు చేసే సంస్కృతి చంద్రబాబు ది అని, హైదరాబాద్ ఉండి జూమ్ లో సలహాలు ఇస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.