ఆ పరిస్థితి వస్తే మంత్రి పదవి వదులుకుంటా – బాలినేని

Thursday, September 3rd, 2020, 12:59:25 AM IST


రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థతి వస్తే తన మంత్రి పదవి వదులు కుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతుల ఉచిత విద్యుత్ కి ఎటువంటి విఘాతం కలగదు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదు అని మీడియా సమావేశం లో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం లో ప్రతి పక్ష పార్టీ నేతలు అనవసరం గా రాద్దాంతం చేస్తున్నాయి అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదు అని తెలిపారు.

ఆనాడు వైయస్సార్ హయాంలో చంద్రబాబు నాయుడు తీగల పై బట్టలు ఆరేసుకోవల్సిందే అని విమర్శలు చేశారు అని, కానీ విద్యుత్ గురించి మాట్లాడితే రైతుల పై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబు ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.