సెప్టెంబర్ 5 నుండి ఏపీ లో స్కూళ్లు ప్రారంభం – మంత్రి ఆదిమూలపు సురేష్

Friday, August 14th, 2020, 02:34:21 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాటశాల లు, కళాశాలలు మూతబడ్డాయి. పరీక్షలు రద్దు అయ్యాయి, ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఏపీ లో 2020-21 విద్యా సంవత్సరం ఖరారు కావడంతో తో పాటశాల లను సెప్టెంబర్ 5 న ప్రారంభిస్తాం అని మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. అయితే అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తాం అని అన్నారు.

అయితే పాటశాలలు ప్రారంభం అయిన రోజే మొత్తం 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా అందజేయనున్నాం అని అన్నారు. ఇందుకోసం 650 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలానే అక్టోబర్ 15 నుండి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి అని తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక సెప్టెంబర్ 15 నుండి 21 వరకు అన్ని ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.