నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు – ఏపీ మంత్రి

Tuesday, October 13th, 2020, 03:00:38 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిల విషయం లో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు నిధులను మంజూరు చేయడం జరిగింది. అయితే 2020 మరియు 21 సంవత్సరానికి గాను కాంపెన్సేషన్ బకాయిలు నిర్మలా సీతారామన్ విడుదల చేయడం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే మిగిలిన ఐజీఎస్టీ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరడం జరిగింది.

అయితే కేంద్ర ప్రభుత్వం నుండే వసూల్ చేస్తున్న లు పన్నుల విషయం పై మంత్రి బుగ్గన ప్రస్తావించారు. అంతేకాక అల చేయడం వలన రాష్ట్ర ఆదాయం తగ్గి ప్రభావం పడుతుంది అని తెలిపారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రాముఖ్యత ఉన్న అంశాల కి అంగీకారం తెలపడం మాత్రమే కాకుండా సరైన విధాన రూపకల్పన చేయాలని తెలిపారు. అయితే కాంపెన్సేశన్ విషయం లో ఏకాభిప్రాయం కోసం మరి కొన్ని సమావేశాలు, ఇంకా లోతైన అధ్యయనం జరగాలి అని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులతో పాటుగా, కరోనా కారణంగా ప్రజల ప్రజా ఆరోగ్యం పై అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుడటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని బకాయిలను త్వరగా చెల్లించాలి అని కోరారు.