ఆ వ్యక్తి కారణం గా మూడు వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళాయి

Thursday, October 29th, 2020, 07:25:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి ను కారణం గా చూపి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్. అయితే ఈ ఎన్నికలు జరిగి ఉంటే మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి అందేవి. అయితే నాడు ఎన్నికలు వాయిదా వేసి, నేడు రోజుకి రెండు నుండి మూడు వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉంటే ఎలా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తారు అంటూ ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ను అధికార పార్టీ కి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సైతం నిమ్మగడ్డ రమేష్ పై, చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్ధమే అంటూ మంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విషయం పై ఆలోచన చేస్తోంది అని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారు, ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికలు అప్పుడే జరగాలి అని వైసీపీ కోరింది, కానీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు కి వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన దశలో ఎలా నమ్ముతారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణం గా రాష్ట్రానికి రావాల్సిన మూడు కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళాయి, దీని పై ఎవరూ మాట్లాడరు ఎందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.