నారా లోకేష్ ను కూడా తుక్కు తుక్కుగా ఓడించారు – మంత్రి బొత్స

Tuesday, August 4th, 2020, 01:04:58 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల, చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఎంపీ లను రాజీనామాలు చేయించి మళ్లీ ప్రజా క్షేత్రం లో కి వెళ్ళాలి అని అన్నారు. అయితే బాబుకి తన పై నమ్మకం ఉంటే తన సవాల్ ను స్వీకరించాలి అని అన్నారు.చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూస్తుంటే మతి స్థిమితం లేదు అని రూఢి అవుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు గత 16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రాంతాల్లో కూడా ఓడిపోయారు అని గుర్తు చేశారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు రాజధాని డిజైన్ కి చెంప పెట్టు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చివరకు నారా లోకేష్ కూడా తుక్కు తుక్కు గా ఓడిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళ గిరి నుండి పోటీ చేసిన ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాక చంద్రబాబు నాయుడు రాజధాని వికేంద్రీకరణ ను వ్యతిరేకించి చరిత్ర హీనులుగా మిగిలి పోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.