ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కి వైసీపీ వ్యతిరేకం – మంత్రి బొత్స

Monday, February 15th, 2021, 12:08:55 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై అటు తెలుగు దేశం పార్టీ నేతలు, ఇటు అధికార పార్టీ వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అవసరం అయితే అసెంబ్లీ లో తీర్మానం చేసేందుకు సిద్దం గా ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అంటూ ఒక స్పష్టమైన నిర్ణయం ను వెల్లడించారు. అయితే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న విషయం వాస్తవమే అని, లాభాల్లో లేని ప్రభుత్వ సంస్థలను కేంద్ర ఆదుకోవాలి అని మంత్రి కోరారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థలు తిరిగి పుంజుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రైవేటీకరణ అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని మంత్రి తెలిపారు.