ఏ క్షణం అయినా పరిపాలనా రాజధానిని విశాఖకి తరలిస్తాం – మంత్రి బొత్స

Monday, March 29th, 2021, 12:02:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక సంఘం మంత్రి బొత్స సత్యనారాయణ మరొకసారి మూడు రాజధానుల అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణం అయినా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు ప్రాంతాల అభివృధ్దకి కృషి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. రాజధానుల పై తెలుగు దేశం పార్టీ కోర్టులకు వెళ్లి రాష్ట్ర అబివృద్ధి ను అడ్డుకుంటుంది అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మూడు రాజధానుల ఏర్పాటు కచ్చితంగా చేసి తీరుతాం అని అన్నారు. మూడు రాజధానులు తమ విధానం అని, న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అని అన్నారు. ఆ ప్రక్రియలోనే ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. అయితే రాష్ట్రంలో మిగిలిన 32 మునిసిపాలిటిలు, మూడు కార్పొరేషన్ లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. అయితే రాజమహేంద్రవరం లో మీడియా తో మాట్లాడిన ఆయన, రాజ మహేంద్రవరం ను మోడల్ సిటీ గా తీర్చి దిద్దుతామని అన్నారు. అయితే విలీన గ్రామాలను కలుపుకొని రాజ మహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి అన్నారు.