చంద్రబాబు, లోకేష్, వారి తాబేదారులు దీనిలో ఉన్నారు – మంత్రి బొత్స

Wednesday, September 16th, 2020, 09:57:05 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మరొకసారి ప్రతి పక్ష పార్టీ టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో తప్పులు జరిగాయనీ తాము ముందు నుండే చెబుతున్నాం అని అన్నారు. అయితే అమరావతి కుంభకోణం పై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు మంత్రి తెలిపారు. సిట్ కూడా వేశామని అన్నారు, అయితే నేడు టీడీపీ నేతలు ఆధారాలు చూపండి అని అంటున్నారు అని అన్నారు.

ఆధారాలు అన్ని ఏసీబీ కి ఇచ్చామని, వారు కేసులు పెట్టారు అని తెలిపారు. అయితే న్యాయస్థానం ఏ విధంగా స్టే ఇచ్చింది అనే దానిపై నేను వ్యాఖ్యానించను అని బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు, లోకేష్, వారి తాబేదారులు ఇందులో ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వదిలేది లేదు అని తేల్చి చెప్పారు. అయితే దమ్ముంటే విచారణ చేయండి అని మీరే అని, ఇప్పుడు హైకోర్టు కి ఎందుకు వెళ్ళారు అంటూ బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. అయితే అన్ని, సాక్షాలు, ఆధారాలు చూపుతున్నాం అని అన్నారు.