“మనసులో మాట” అనే పుస్తకం లో వ్యవసాయం దండగ అని రాశారు

Tuesday, December 1st, 2020, 12:00:42 AM IST

తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏ ప్రాంతం లో ఏ పంట పండుతుందో తెలియని వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడ ఏ పంట పండుతుంది అనేది చెబితే తాను తల దించుకొని కూర్చుంటాను అని తెలిపారు. ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు అని, రైతుల ట్రాక్టర్ ను బురద గుంట లోకి పోనివ్వడం తప్ప లోకేష్ కి ఏం తెలుసు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్రాక్టర్ ను బురదలో దింపడమే కాకుండా, దాన్ని రైతులతో బయటికి తీయించుకున్న వ్యక్తి నారా లోకేష్ అంటూ సెటైర్స్ వేశారు.

నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, వారికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు నిరసన చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు మనసులో మాట అనే పుస్తకం లో వ్యవసాయం దండగ అని రాశారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ఆ పుస్తకం తీసుకు వస్తే వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తామని తెలిపారు. చైర్మన్ అవకాశం ఇస్తే టీవీ లో కూడా వేసి చూపిస్తాం అంటూ మంత్రి ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేశారు.