టీడీపీ లాంటి దుష్ట శక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయి

Friday, August 14th, 2020, 03:00:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానుల విషయం పై తెలుగు దేశం పార్టీ నేతలు అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని పార్టీల అభివృద్ది లక్ష్యం అని మంత్రి బొత్స సత్యనారాయణ మరొకసారి స్పష్టం చేశారు. అయితే అమరావతి లో పెండింగ్ పనుల పై సీఎం జగన్ దృష్టి పెట్టారు అని అన్నారు. తక్షణమే పనులను ప్రారంభించాలని అధికారులను సైతం ఆదేశాలు ఇచ్చిన సంగతిని వివరించారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ను అభివృద్ది చేయాలని గతంలోనే నిర్ణయించాం అని తెలిపారు.

అయితే ఈ మేరకు టీడీపీ పై , చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ది చెందడం చంద్రబాబు కి ఇష్టం లేదు అని, ఒడినప్పటి నుండి బాధ్యత విస్మరించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ మూడు రాజధానుల కి ఆమోదం తెలిపిన తరువాతే విశాఖ లో శంకుస్థాపన చేయాలని భావించిన విషయాన్ని తెలిపారు. అయితే టీడీపీ లాంటి దుష్ట శక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయి అని తెలిపారు. శంకుస్థాపన కి ప్రధాని నుండి, దేశంలోని పెద్దలను ఆహ్వానిస్తామని, శుభ కార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సంప్రదాయం అని అన్నారు.