కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దు – మంత్రి బొత్స

Wednesday, September 9th, 2020, 09:08:39 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు నిర్మాణాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. విజయవాడ లోని మధుర నగర్ లో ట్రాఫిక్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీ చేసారు అని మంత్రి తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్య లు తీరిపోతాయి అని, 10 కో రైల్వే నిధులతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మరొక 6 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుంది అని అన్నారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శాసన రాజదాని అంశం పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే అన్ని వర్గాలకు చెందిన ప్రాంతం గా రాజదాని ఉండాలి అనేది నాని ఉద్దేశ్యం అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజదాని లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దు అనడం కరెక్ట్ కాదు అని, కొంత మందే రాజధాని లో ఉండాలి అనుకోవడం సరి కాదు అనేది నాని అభిప్రాయం అని తెలిపారు. అయితే అది నాని అభిప్రాయం మాత్రమే అని, రాజధానిని అమరావతి నుండి తప్పిస్తాం అని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు అని బొత్స మరొకసారి తేల్చి చెప్పారు.