బీజేపీ ఎవరిని తెచ్చుకున్నా సీఎం జగన్ కి ప్రజా బలం ఉంది – మంత్రి బొత్స

Wednesday, March 31st, 2021, 05:28:12 PM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి బొత్స సత్యనారాయణ మరొకసారి ప్రశంసల వర్షం కురిపించారు. 20 నెలల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారు అని అన్నారు. ఇందుకు మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. ఇదే ఉత్సాహం తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో కూడా ఉంటుంది అని, వైసీపీ విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతల పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం అభ్యర్ధి కి, ఉప ఎన్నికకు ఉన్న సంబంధం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇటువంటి వాటి పై స్పందించాల్సిన అవసరం లేదని, పాదయాత్రలు, తలకిందు యాత్రలు చేసినా తమకు ఏం నష్టం లేదు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఎవరిని తెచ్చుకున్నా సీఎం జగన్ కి ప్రజా బలం ఉందని మంత్రి తెలిపారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణ పై మంత్రి బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు.