నారా లోకేష్ తో పాటుగా పలువురు టీడీపీ నేతలకి ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

Saturday, August 22nd, 2020, 02:10:53 AM IST


గత కొద్ది రోజుల క్రితం తమిళనాడు లో అయిదు కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ డబ్బు మంత్రి బాలినేని దే అంటూ తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతలు ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక కొన్ని టీవీ ఛానెల్స్ కూడా ఇదే వార్తను ప్రచారం చేశాయి. పట్టుబడిన అయిదు కోట్ల రూపాయలు ఒంగొల్ కి చెందిన ఒక బంగారం వ్యాపారి అయిన నల్లమల్లి బాలు ప్రకటించినా కూడా మళ్లీ ఆరోపణలు చేయడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు.

తన పై తప్పుడుగా ప్రచారం చేసిన మీడియా ఛానెల్స్ కి, తెలుగు దేశం పార్టీ నాయకులకు మంత్రి లీగల్ నోటీసులు పంపారు.తన పై లేనివి కల్పించి తప్పుడు వార్తలు ప్రచారం చేయించారు అంటూ, నారా లోకేష్, బోండా ఉమా, పట్టాభి లతో పాటుగా, టీవీ 5, న్యూస్18 లకు మంత్రి లీగల్ నోటీసులు పంపారు. చట్టపరమైన చర్యలు ప్రారంభించడం పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.