ముప్పు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి శ్రీనివాస్

Wednesday, October 14th, 2020, 06:22:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. అయితే విశాఖ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. అయితే రాంబిల్లి మండలం లో గురజాల గ్రామం వద్ద శారద నదికి గండి పడటం తో దాదాపు 4500 ఎకరాల వరి పంట మునగడం తో తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడింది.

అయితే భారీ వర్షాల కారణంగా వరదలు గ్రామం చుట్టూ ఉండటం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ నేపధ్యంలో పర్యటించి, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టాన్ని వరదలు తగ్గిన అనంతరం అంచనా వేసి, రైతులను ఆదుకుంటామని చెప్పారు.