జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్ లు పనిచేయవు

Sunday, December 20th, 2020, 11:00:40 PM IST

మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన తెలుగు దేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు తెలుగు దేశం పార్టీ మైండ్ గేమ్ లు పనికి రావు అని చెప్పుకొచ్చారు. అయితే విశాఖ పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే లు, మాజీ లు భూ కబ్జాలకు పాల్పడి, వైసీపీ నాయకులు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నిజం చెబితే చంద్రబాబు కి శాపం కాబోలు అన్ని అబద్ధాలే చెబుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా, వైసీపీ నేతలు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు, మంత్రులు టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.