రెండు సార్లు జైలుకెళ్లోచ్చినా అచ్చెన్నాయుడు కి ఇంకా బుద్ది రాలేదు – మంత్రి అవంతి శ్రీనివాస్

Tuesday, February 16th, 2021, 02:59:12 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నాయకుల వైసీపీ తీరును విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వైసీపీ వ్యతిరేకం అని, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ లేఖ రాశారు అని అన్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ నేతలు ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొస్కో తో కలిసినంత మాత్రాన లాలూచీ పడినట్లు కాదు అని స్పష్టం చేశారు. 2014 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి చర్చలు జరగలేదా? 2018 లో పాస్కో ప్రతినిధులు చంద్రబాబు ను కలవలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం జగన్ పై ఇష్టానుసారం గా మాట్లాడితే సహించేది లేదు అని వ్యాఖ్యానించారు. రెండు సార్లు అచ్చెన్నాయుడు జైలుకెళ్లోచ్చినా బుద్ది రాలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పై తమ పార్టీ స్పష్టమైన నిర్ణయం తో ఉందని పేర్కొన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ పై ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు నాయుడు ఎందుకు లేఖ రాయలేదు అంటూ సూటీగా ప్రశ్నించారు.